తిరుమలకు నడిచివచ్చే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు టీడీడీ తీపికబురు అందించింది. ఏప్రిల్ 1నుంచి దివ్య దర్శన టికెట్లు జారీ చేయనున్నట్ల టీటీడీ ప్రకటించింది. కాగా అలిపిరి నడకదారిలో రోజుకు 10వేల టికెట్లు,శ్రీవారి మెట్టు నడక మార్గంలో రోజుకు 5 వేల టికెట్లు పంపిణీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ వేసవిలో బ్రేక్, సిఫార్సు లెటర్లను తగ్గిస్తామని పేర్కొంది. వీటితోపాటు తిరుమలలో భక్తులకు కల్పించే వసతి విషయంలో కీలక మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేంటంటే ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తో వసతి సౌకర్యం కేటాయింపులు చేపడతామని టీటీడీ స్పష్టం చేసింది.

