Andhra PradeshHome Page Slider

టీటీడీ కీలక నిర్ణయం

టీటీడీ బోర్డు అక్కడ పనిచేసే అన్యమత ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారిని ప్రభుత్వానికి అప్పగిస్తామని పేర్కొంది. అంతేకాక పరిపాలనా పరమైన కొన్ని నిర్ణయాలు కూడా ఈ మీటింగులో తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు  తెలియజేశారు. శ్రీనివాస సేతు వంతెనను గతంలో ఉన్న గరుడ వారధి అనే పేరుతోనే నామకరణం చేస్తున్నామన్నారు. ప్రైవేట్ బ్యాంకులలో ఉన్న టీటీడీకి సంబంధించిన నగదు డిపాజిట్లను ప్రభుత్వంలోకి బదలాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, డంపింగ్ యార్డుల్లోని చెత్తను 3 నెలలోగా తొలగిస్తామని పేర్కొన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి, స్థలాన్ని తిరిగి తీసుకుంటామన్నారు.