టీటీడీ కీలక నిర్ణయం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు భారీ వర్షసూచన హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీనితో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు చర్యలలో భాగంగా ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. రేపు సిఫార్సు లేఖలు అంగీకరించకూడదని తీర్మానించింది. మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా తుఫాను సమయంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

