Andhra PradeshNews Alert

శ్రీవారి భక్తులకు TTD విజ్ఞప్తి

తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమవుతోంది. ఈ నెల 27 నుండి జరగనున్న బ్రహ్మోత్సవాలలో సామాన్యభక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా టీటీడీ భక్తులు సమర్పించే కానుకల విషయంలో కీలకమైన సూచనలు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుండి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని TTD భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఆసమయంలో అందించే కానుకలు టీటీడీకి చేరవని, వాటితో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు హిందూ సంస్థలు గొడుగులను స్వామివారికి ఆనవాయితీగా సమర్పిస్తూ ఉంటారు.

గత రెండుసంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు కరోనా కారణంగా ఏకాంతంగా జరిగాయి. ఈ సారి బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్నిరకాల ఇతర దర్శనాలను రద్దుచేసింది టీటీడి. కేవలం ప్రొటోకాల్ విఐపి బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుందని సూచించింది. గదుల్లో అలాట్ మెంట్‌కు సంబంధించి  కూడా 50 శాతం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు.

ఈ నెల 27 నుండి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.