Home Page SliderNational

“విరూపాక్ష” కలెక్షన్ల సునామీ

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ “విరూపాక్ష” సినిమాతో తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన “విరూపాక్ష” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలై 10రోజులు అవుతున్నప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కాగా ఈ  సినిమా చూసేందుకు థియేటర్ల వద్ద ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. దీంతో ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు 76 కోట్లు కలెక్షన్లు  వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేసింది. సాయిధరమ్ తేజ్ ,సంయుక్త మేనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో “విరూపాక్ష” సినిమా తెరకెక్కింది.