Home Page SliderInternational

ఫస్ట్‌డే “దేవర” కలెక్షన్ల సునామీ..ఎన్నికోట్లంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దేవర’ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానితో ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఫస్ట్‌డే కలెక్షన్లలో రికార్డు సాధించి ఒక్కరోజులో రూ.140 కోట్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.77 కోట్లయితే కేవలం ఆంధ్ర, తెలంగాణ నుండి మాత్రమే రూ.68 కోట్లు సాధించినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా అలరించారు. ఎన్టీఆర్ డబుల్ రోల్‌లో ప్రేక్షకులకు తన నటవిశ్వరూపాన్ని చూపించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు, విజయవంతం చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.