Andhra PradeshNews

 విజయవాడ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన TSRTC

విజయవాడ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది TSRTC. హైదరాబాద్ -విజయవాడ మార్గంలో బస్సు చార్జీలలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలియజేశారు. ఈ రూట్‌లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ రాయితీ కేవలం విజయవాడ, హైదరాబాద్ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల టికెట్‌పై 50 రూపాయల వరకు ఆదా ఉంటుంది. రిజర్వేషన్ కొరకు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆర్టీసీ చైర్మన్ బాజీ గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని ఆశించారు.