Home Page SliderTelangana

TSRTC: బస్సులన్నీ అతివలతో నిండిపోతున్నాయి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సుల్లో TSRTC  మహిళలకు ఉచిత పథకానికి క్షేత్రస్థాయిలో స్పందన లభిస్తోంది. బస్సులన్నీ అతివలతో నిండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో నిత్యం పదుల సంఖ్యలో ఆ రాష్ట్ర బస్సులు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన్పటి నుండి ఆ రాష్ట్ర బస్సుల్లో ఎవరూ ఎక్కడం లేదు. మహారాష్ట్రలోని దెగ్లూర్ డిపోకు చెందిన బస్సు నిత్యం నిజామాబాద్‌కు రెండుసార్లు తిరుగుతుంది. ఒక్కో ట్రిప్పునకు రూ.15 వేల కలెక్షన్ వచ్చేది. కానీ గత మూడు రోజులుగా రూ.6 నుండి 7 వేలకు పడిపోయింది. ఈ డబ్బులు డీజిల్‌కు కూడా సరిపోవని కండక్టర్, డ్రైవర్ వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ బస్సుల్ని ఎలా తిప్పాలో అర్థం కావడం లేదన్న ఆర్టీసీ యాజమాన్యం.