Home Page SliderTelangana

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు, జూన్ 11న తిరిగి పరీక్ష

తెలంగాణలో జరుగుతున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం జరిగిన కమిషన్‌ ప్రత్యేక సమావేశంలో సిట్‌ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 16న, ఏఈఈ ఈ ఏడాది జనవరి 22న, డీఏవో ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగాయి. రద్దు చేసిన గ్రూప్ 1 పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు జూనియర్ లెక్చరర్ల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. రద్దు చేసిన పరీక్షలను తిరిగి నిర్వహించాలని TSPSC నిర్ణయించింది. మిగతా రెండు పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామంది. అయితే కమిషన్ తాజా నిర్ణయంపై గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.