TSPSC నిర్లక్ష్యం..ఒంటిపై పెట్రోల్ పోసుకున్న విద్యార్థి
TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే నగేశ్ అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

