మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. నెటిజన్స్ ఆగ్రహం!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా మెగాస్టార్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. సెల్ఫీకోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశారు. ఒక అభిమాని పట్ల ఇలా ప్రవర్తించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.