ట్రంప్ టైమ్ స్టార్టయ్యింది..రష్యాకు హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసింది మొదలు దూకుడుగా పనులు మొదలుపెట్టేశారు. తన టైమ్ స్టార్టయ్యిందని, ఇక శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తానని అంటున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హెచ్చరికలు చేశారు. ఆయనతో త్వరలో భేటీ అవుతానని ప్రకటించారు. మూడేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. కీవ్‌లో శాంతి ఒప్పందాలకు రష్యా ఒప్పుకోకపోతే ఆంక్షలు విధిస్తానని పేర్కొన్నారు. పుతిన్‌తో తనకు బలమైన అనుబంధం ఉందని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీతో కూడా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా కొనసాగించే విషయం పరిశీలిస్తున్నానని మీడియాకు వెల్లడించారు.