ట్రంప్‌కు షాక్..భారత్‌కు లక్కీ ఛాన్స్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు పలు దిగ్గజ వ్యాపార సంస్థలు తమ స్ట్రాటజీలను మార్చుకుంటున్నాయి. ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ టారిఫ్‌ల నుండి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ, భారత్‌ను ఎంచుకుంది. దీనితో భారత్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. భారత్‌లో తన ఐఫోన్ తయారీ యూనిట్లను పెంచాలని, తద్వారా ఉత్పత్తిని పెంచాలని ఆలోచిస్తోంది. చైనాపై 104 శాతం పన్ను విధించిన ట్రంప్ సర్కార్, వియత్నాంపై 46 శాతం, భారత్‌పై 26 శాతం పన్నులు విధించింది. దీనితో భారత్ నుండి ఎగుమతి చేసే ఉత్పత్తులకు పన్నులు తక్కువగా ఉండడంతో ఇక్కడి నుండి అమెరికాకు ఫోన్లను ఎగుమతి చేసేలా వ్యూహం సిద్దం చేసింది యాపిల్ సంస్థ. యాపిల్‌కు అమెరికానే అతి పెద్ద మార్కెట్. ఈ ఏడాది 9 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయాలని కంపెనీ అంచనాలు వేస్తోంది.
Breaking news: ముంబయి పేలుళ్ల నిందితుడు భారత్‌కు..

