ట్రంప్ రికార్డు విక్టరీ..
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ రికార్డు విక్టరీ సాధించారు. భారీ మెజార్టీతో బిగ్ జడ్జిమెంట్ డే నాడు చరిత్ర సృష్టించారు. ఇప్పటికే 267 సీట్లు సాధించి మెజారిటీ కనపరుస్తున్నారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అధ్యక్ష రేసులో వెనుకబడ్డారు. 224 సీట్లతో పార్టీ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకూ 491 స్థానాలు ఫలితాలు ప్రకటించారు. దీనితో స్పష్టమైన మెజారిటీ ట్రంప్‌దేనని తేలిపోయింది. రెండవసారి అధ్యక్షపీఠం ఎక్కబోతున్నారు ట్రంప్. స్వింగ్ స్టేట్స్‌లో భారీ విజయం సాధించారు. మద్దతు దారుల విజయోత్సాహాల మధ్య సక్సెస్ మీట్‌లో భార్య మెలానియా, చిన్న కుమారుడితో కలిసి పాల్గొన్నారు. తన జీవితంలో ఇలాంటి క్షణం చూడలేదని, అమెరికాకు స్వర్ణయుగం తెస్తానని ప్రకటించారు. ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబోతున్న జే.డి.వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. ఉషా చిలుకూరి తెలుగువారు కావడం విశేషం. తనకు ఎన్నికల ప్రచారంలో అండగా నిలిచిన ఎలాన్ మస్క్ కారణంగానే ఇంత ఘనవిజయం లభించిందని పేర్కొన్నారు ట్రంప్.

