ట్రంప్ బంధుప్రీతి..ముఖ్యమైన పదవులన్నీ వారికే..
అమెరికా అధ్యక్షునిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన అధికారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమైన పదవులలో తన స్నేహితులను, బంధువులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు రెడీ చేసుకున్నారు. తాజాగా తన వియ్యంకులకు సలహాదారు పదవులు ఇస్తూ బంధుప్రీతిని చాటుకున్నారు. తన కుమార్తె టిఫానీ మామగారిని పశ్చియాసియా సలహాదారుగా నియమించారు. అరబ్ అమెరికన్ల ఓట్లను సాధించడంలో వియ్యంకుడు మసాద్ బౌలోస్, ట్రంప్‌కు ఎన్నికలలో సహాయపడ్డారు. మరో కుమార్తె ఇవాంకా ట్రంప్ మామగారు ఛార్లెస్‌ను ఫ్రాన్స్‌కు అమెరికా రాయబారిగా నియమించారు. ఇప్పటికే సన్నిహితులు ఎలాన్‌మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.