అమెరికన్లకు ట్రంప్ గుడ్‌న్యూస్..
అమెరికన్లకు ట్రంప్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. వారు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి సరికొత్త పథకాలు ప్రవేశపెట్టింది. బేబీ బోనస్ పేరుతో బిడ్డ పుట్టిన వెంటనే 5 వేల డాలర్ల బహుమతిని ప్రకటించింది. అలాగే మహిళలకు సంతాన సాఫల్యంపై అవగాహన కల్పించడానికి పలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇతర దేశాల వారిపై, వలస దారులపై కఠిన చర్యలు అవలంభిస్తున్న ట్రంప్ సర్కారు అమెరికన్ల జనాభాను పెంచే విధంగా చర్యలు చేపడుతోంది.