కమలాహారిస్‌తో డిబేట్‌పై ట్రంప్ వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం తీవ్రమయ్యింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌తో డిబేట్‌కు తాను సిద్దంగా లేనని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికే ఆలస్యమయ్యిందంటూ సమాధానం చెప్పారు. సీఎన్‌ఎన్ బ్రాడ్ కాస్టింగ్ నుండి అక్టోబర్ 23న డిబేట్ కోసం వచ్చిన ఆహ్వానాన్ని హారిస్ మన్నించినా, ట్రంప్ అంగీకరించలేదు. నవంబర్ 5 నుండి ఎన్నికలు మొదలవుతుందని, ఇప్పటికే కొన్ని చోట్ల ఓటింగ్ మొదలయ్యిందని ఆయన పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి మధ్య ఒకసారి డిబేట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆ డిబేట్‌లో కమలాహారిస్ పైచేయి సాధించినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీనితో ట్రంప్ అప్పట్లో చాలా అసహనానికి గురయ్యారు. అప్పుడే తాను మరోసారి కమలా హారిస్‌తో డిబేట్‌లో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఆమె తన దృష్టిలో ఎప్పుడో ఓడిపోయిందని పేర్కొన్నారు.

