Breaking NewsHome Page Sliderhome page sliderInternational

భారత్–పాక్‌ ఉద్రిక్తతలపై ట్రంప్‌ వ్యాఖ్యలు

భారత్‌–పాక్‌ (India–Pakistan) మధ్య శాంతి కోసం తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మియామిలో జరిగిన అమెరికా బిజినెస్‌ ఫోరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “వాణిజ్య సుంకాల వల్ల ఈ యుద్ధానికి బ్రేకులు వేశాను” అని పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో ట్రంప్‌ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ కూలిన ఫైటర్‌ జెట్ల (Fighter Jets) సంఖ్యను పెంచి చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఏడు జెట్లు కూలిపోయాయి అని చెప్పిన ట్రంప్‌.. ఇప్పుడు “ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయాయి” అని పేర్కొన్నారు. అతను తనను తాను ప్రపంచ శాంతికర్తగా పేర్కొంటూ, “అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలను ఆపగలిగాను” అని అన్నారు.
ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.