అమెరికన్లకు ట్రంప్ బంపర్ ఆఫర్
అమెరికన్ ఓటర్లకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష రేసులో వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తనను అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఓటర్లకు ఆదాయపు పన్ను రద్దు చేస్తానని ఆశలు పెడుతున్నారు. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎలక్షన్ల పోరులో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు ట్రంప్. వివిధ వివాదాలలో చిక్కుకుని కోర్టు కేసులలో జరిమానాలు కట్టిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టకపోవడంతో అప్పటి అధ్యక్షునిగా ఉన్న ట్రంప్‌పై అమెరికన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సిద్దమవుతున్నాడు ట్రంప్.