Breaking NewsInternational

వెస్ట్ బ్యాంక్ స్వాధీనంపై ఇజ్రాయెల్ ప్రయత్నాలు — ట్రంప్ ఆగ్రహం

వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ ఆధిపత్య ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. గాజా డీల్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ అమెరికా అధికారి హెచ్చరించారు.

“ట్రంప్‌తో నెతన్యాహు ప్రస్తుతం క్లిష్టమైన దౌత్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గాజా ఒప్పందాన్ని నిర్వీర్యం చేయాలని నెతన్యాహు ప్రయత్నిస్తే, ట్రంప్ నుండి తీవ్ర ప్రతిస్పందన రావచ్చు” అని ఆ అధికారి పేర్కొన్నారు.

గాజా–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సున్నితమైన శాంతి చర్చల నేపథ్యంలో ఈ హెచ్చరిక అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.