కెనడా, మెక్సికోలకు ట్రంప్ ఝలక్..
అమెరికా పొరుగు దేశాలు కెనడా, మెక్సికోలకు కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఝలక్ ఇచ్చారు. ఆ రెండు దేశాలకు భారీ ఎత్తున అమెరికా రాయితీలు ఇస్తోందని, అంత ఇవ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కలిసిపోతే బెటరని వ్యాఖ్యానించారు. కెనడా ప్రధాని ట్రూడోతో ఇటీవల ఫ్లోరిడాలో సమావేశమయ్యారు ట్రంప్. ఆ సమావేశంలోనే అక్రమవలసదారులను కట్టడి చేయకపోతే భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. అక్రమ వలసలు, డ్రగ్స్‌ను కెనడా అదుపు చేయలేకపోతే అమెరికాలో విలీనమవ్వాలని చురకలు వేసినట్లు వార్తలు వచ్చాయి. కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లు, (రూ.8లక్షల కోట్లు), మెక్సికోకు 300 బిలియన్ డాలర్లు(రూ.24 లక్షల కోట్లు) సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంత రాయితీలు ఆ దేశాలకు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అందుకే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం అయితే మంచిదన్నారు.