Home Page SliderInternational

‘టీ షర్టు’ పై నిర్దోషినని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తరచూ వార్తల్లో కెక్కుతున్నారు. ట్రంప్‌ను అరెస్టు చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో తనపై నేరారోపణను ఖండించే ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూయార్క్ కోర్టులో రెండ్రోజుల క్రితమే తనపై అభియోగాలను ఖండించారు. ‘ఐయమ్ నాట్ గిల్టీ’ అంటూ సమాధానం చెప్పారు. ఇప్పుడు దానిని వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. ట్రంప్ నిర్దోషి అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి ఫోటో దిగారు. దానిని తన మద్దతుదారులకు పంచాలని నిర్ణయించారు. మగ్‌షాట్ పేరుతో ఈ మెయిల్ పంపి, ట్రంప్‌కు మద్దతుగా నిలవాలనుకొనేవారు 47 డాలర్లు పంపమని, టీ షర్ట్‌ను ఉచితంగా పంపుతామని పేర్కొన్నారు. ఉచితంగా పంచడానికి 47 డాలర్లు ఎందుకో?