Home Page SliderInternational

‘షేక్‌హ్యాండ్‌’తో మొదలై, హాట్‌హాట్‌గా కొనసాగిన ట్రంప్, హారిస్ డిబేట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య జరిగిన తొలి డిబేట్ రసవత్తరంగా సాగింది. బుధవారం  ఏబీసీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వీరిద్దరి మధ్య షేక్‌హ్యాండ్‌తో మొదలైన డిబేట్ హాట్‌హాట్‌గా కొనసాగింది.

ఈ వాగ్వాదంలో ఒకింత కమలాహారిస్ పైచేయి సాధించినట్లు కనిపించారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌పై ట్రంప్ విమర్శలు మొదలుపెట్టగానే, కమల అడ్డుకున్నారు. ఇప్పుడు డిబేట్ బైడెన్‌తో కాదు, మీరు నాపై పోటీ చేస్తున్నారు, ఆయనతో కాదు అంటూ మండిపడ్డారు. తాను బైడెన్‌నూ కాదు, ట్రంప్‌నూ కాదు, అమెరికాకు కొత్తతరం నాయకత్వాన్ని అందించడానికే పోటీకి దిగాను అంటూ స్పష్టం చేశారు.

వీరిద్దరి మధ్యా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మాటలు రాగానే, ట్రంప్ వాదిస్తూ తాను అధ్యక్షునిగా ఉండి ఉంటే ఒక్క రోజులో యుద్ధం ముగిసేదన్నారు. దీనికి ధీటుగా బదులిచ్చారు హారిస్. ట్రంప్ అధ్యక్షుడయితే ఈ పాటికి ఉక్రెయిన్‌ను రష్యాలో విలీనం చేసేవారని, కీవ్‌లో పుతిన్ కూర్చునేవారని ఎద్దేవా చేశారు.

డిబేట్ అనంతరం ట్రంప్ స్పందిస్తూ ఇది అత్యుత్తమ చర్చగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.