BusinessHome Page SliderInternationalNewsTrending Today

ట్రంప్ మళ్లీ సాధించాడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై ఇష్టారాజ్యంగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ట్రేడ్ కోర్టు ఈ సుంకాలపై అధ్యక్షునికి పూర్తి అధికారం లేదని, కాంగ్రెస్ మద్దతు లేకుండా అధ్యక్షుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోరాదని సుంకాల పెంపుదలను నిలిపివేసింది. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ట్రంప్ పై కోర్టుకు అప్పీలుకు వెళ్లి తన మాట నెగ్గించుకున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలపై విచారించిన కోర్టు ట్రేడ్ కోర్టు ఆదేశాలను నిలిపివేస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఫిర్యాదుదారులు జూన్ 5 లోగా, ప్రభుత్వం జూన్ 9లోగా వారి స్పందనను తెలియజేయాలని పేర్కొంది.