ఎన్నికలను ఆపాలని టీఆర్ఎస్ కుట్ర: బండి సంజయ్
ఇండిపెండెంట్లకు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేయడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన యారాగండ్లపల్లిలో మాట్లాడుతూ… న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుందని… మునుగొడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ గుర్తులు ఉన్నాయని… ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు.