Home Page SliderTelangana

త్రిషకు కోటి నజరానా..

తెలంగాణకు చెందిన క్రికెటర్ త్రిష గొంగడి అద్బుత ప్రదర్శనతో అండర్ -19 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంలో సీఎం త్రిష భవిష్యత్ లో దేశం తరఫున మరింత పెద్ద స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అండర్ -19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి 10 లక్షలు, జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.