News

కృష్ణంరాజు మృతిపై సందేశాల వెల్లువ

కృష్ణంరాజు మృతిపై వి మిస్ యు కృష్ణంరాజు గారు అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు గారు ఇక లేరని తెలిసి షాక్ అయ్యానన్నారు మహేష్ బాబు. నాకు, మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజన్నారు. ఆయన జీవితం, ఆయన చేసిన కృషి, సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ కష్ట సమయంలో ప్రభాస్‌కి మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు గారు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానని… ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నానన్నారు.

కృష్ణంరాజు మృతిపై చిరంజీవి ఇలా ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కృష్ణంరాజు మృతి కలచివేసిందన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

కృష్ణంరాజు మృతి పట్ల బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణంరాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

కృష్ణంరాజు మృతి బాధించిందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్