Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

పచ్చబొట్టుతో కటాకటాలపాలైన జననేత

నా దేవుడు నువ్వే …అంటూ నమ్మాడు. వినయంగా మట్టుబెట్టారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మూడు రాష్ట్రాల్లో సంచలనచర్చగా మారింది. నమ్మితే ప్రాణాలు తీసుకుంది. చెదోడు వాదోడు గా నిలిచి సర్వం అనుకున్న మిధునం మృత్యువుగా మార్చింది. శ్రీకాళహస్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్ధి ఆగ్రహం వినయం విధేయత ఓ ప్రాణం తీసింది. ఆ కుటుంబం నడిరోడ్డుపై నేడు రోధిస్తోంది. నమ్మిన బంటుగా ఉంటూ చెప్పిన చేస్తున్నందుకు శ్రీనివాసరాయుడుని, ఆదంపతుల చేతిలో మృతదేహంగా మారడంతో గురుదక్షిణ తీసుకున్నారు. డెడ్ బాడీని చైన్నైలో పడేసి తమకేమి పట్టన్నట్టు శ్రీకాళహస్తిలో పల్లీలు తింటున్నారు. అతడిని అంతం అనంతరం ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్టు జనప్రియులిద్దరూ సొంత గ్రామానికి వచ్చారు. మృతుడు శ్రీనివాస రాయుడు చేతిపై పచ్చబొట్టు ఆధారంగా చెన్నై పోలీసులు ఈ కేసును సాధించి చేధించారు. జననేతలిద్దరూ కటాకటాలపాలైయారు. బాధితుడి సోదరి, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యుల ఫిర్యాదులో మరికొన్ని కొత్త విషయాలతో పోలీసులు నివ్వేరపోయారు. నిందితురాలే ఫోన్ చేసి 30 లక్షలిస్తాం..ఈ విషయాన్ని మర్చిపోవాలంటూ బెదిరింపులకు దిగింది .పవన్ కల్యాణ్ స్పందించాలి..ఈ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని భాదిత కుటుంబం వేడుకుంటోంది.రసకందాయ రాజకీయం .. 2024 లో శ్రీకాళహస్తి అసెంబ్లీ కి జనసేన అభ్యర్ధిగా పోటీచేసిన పోటీచేసిన కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు కలసి తమ డ్రైవర్ రాయుడుని హత్య చేసి చెన్నైలో పడేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. వినూత పేరును హతుడు రాయుడు తన చేతిపై పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ క్రమంలో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పచ్చబొట్టు ఆధారంతో చెన్నై పోలీసులు మృతుని కేసులో పురోగతి సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినూత వినూత్నంగా తప్పు చేసిందా… జనసేన నేత కోట వినూత చేసిన తప్పే తనకు ముప్పుగా మారింది. ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. ఫైర్ బాండ్ గా పేరున్న వినూత మరిన్ని చిక్కుల్లో చిక్కుకుంది. వాస్తవానికి ఎడాదిన్నర క్రితం రాజకీయంగా అనేక సవాళ్లను వినూత దంపలిద్దరూ ఎదుర్కోన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఈ కేసులో రోజుకో ట్వీస్ట్ తో వెలుగుచూస్తోన్న నేపధ్యంలో మృతుడు రాయుడు కాల్ డేటాతో నివురుగప్పిన నిప్పు బయటపడుతుందని పోలీసులు వెల్లడించారు.