బ్యాంకాక్ నుంచి పాములతో ప్రయాణం
పాములతో బ్యాంకాక్ నుంచి హైద్రాబాద్ వరకు ప్రయాణించారు.కానీ చివరకు కస్టమ్స్ అధికారులకు పట్టుబడిపోయారు.చెకింగ్ చేస్తున్న అధికారులు సైతం పాములను చూసి విస్తుబోయారు.ఈ ఘటన హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం తెల్లవారు ఝామున జరిగింది.బ్యాంకాక్ కు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పాములను ఓ ప్రత్యేకమైన బ్యాగులో గుట్టుచప్పుడు కాకుండా హైద్రాబాద్ తరలించారు.శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెకింగ్ చేస్తుండగా బ్యాగు నుంచి కదలాడుతున్న వస్తువులు కనిపించాయి.దీంతో స్కానర్ కి కూడా అంతుబట్టకపోవడంతో ఏంటా అని బ్యాగు ఓపెన్ చేసి చూడగా అందులో పాములున్నాయి.దీంతో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు.అక్కడ నుంచి కొంత దూరం జరిగి…ఆనక తేరుకున్నారు.పాములను తరలిస్తున్న ఇద్దరు మహిళలను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.