Breaking NewsHome Page Slider

టికెట్ లేకుండా వందే భారత్ రైల్లో ప్రయాణం.. బాత్‌రూమ్‌లో సిగిరెట్ వెలిగించాడు.. ఇంతలో ఏం జరిగిందంటే…?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఐతే ప్రయాణాన్ని వేగవంతం చేయడం, రాళ్ల దాడులు లేదా పశువులను ఢీకొట్టడం కోసం కాదు. ప్రయాణ సమయంలో సిగరెట్ కోరికను తట్టుకోలేని టికెట్ లేని ప్రయాణీకుడి తీరుతో. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలు గూడూరు దాటింది. గమ్యం చేరడానికి ఇంకా ఎనిమిది గంటలకు పైగా సమయం ఉంది. ప్రయాణికుడు చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైలు ఎక్కి టాయిలెట్‌లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. ప్రయాణాన్ని ఉచితంగా చేయాలనుకున్నాడు. ఐతే రైలులో అమర్చిన ఫైర్ అలారం గురించి తెలియక, టాయిలెట్‌కి వెళ్లి సిగరెట్ వెలిగించాడు. తక్షణమే, అలారం మోగడం ప్రారంభమైంది. కంపార్ట్‌మెంట్ ద్వారా ఏరోసోల్‌ చల్లుతూ… ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌కు రైల్వే సిబ్బంది పని చెప్పారు.

తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లోని ఎమర్జెన్సీ ఫోన్‌ను ఉపయోగించి రైలు గార్డును అప్రమత్తం చేశారు. రైలు మనుబులు స్టేషన్ దగ్గర ఆగింది. రైల్వే పోలీసు సిబ్బంది మంటలను ఆర్పే యంత్రంతో రంగంలోకి దిగి టాయిలెట్ కిటికీ అద్దాన్ని పగులగొట్టారు. లోపల వారు ప్రయాణికుడిని కనుగొన్నారు. రైలును ఆపి, పూర్తి స్థాయి రెస్క్యూ ఆప్‌ను ప్రారంభించారు. పొగ తాగిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నెల్లూరుకు తరలించారు. ఆ తర్వాత ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. మొత్తం ఘటన ప్రయాణీకుల్లో భయాందోళనలకు కారణమైంది. “ఒక అనధికారిక ప్రయాణికుడు తిరుపతి నుండి రైలు ఎక్కి C-13 కోచ్‌లోని టాయిలెట్‌లోకి ప్రవేశించాడు. టాయిలెట్ లోపల పొగ తాగాడు. దీంతో టాయిలెట్ లోపల ఒక ఏరోసోల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయింది” అని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారి తెలిపారు.