ఉచితంగా బస్సులో ప్రయాణం.. పెట్రోలు ఎలా? డీజిల్ ఎలా?
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడంపై ఓ వృద్ధురాలు చేసిన కామెంట్స్ ఆలోచింపజేస్తున్నాయి. బస్సులో ఫ్రీగా వెళ్తున్నారు కదా? ఎలా ఫీలవుతున్నారని మీడియా ఓ మహిళను ప్రశ్నించింది. దానికి ఆమె స్పందిస్తూ.. టిక్కెట్ ఉంటేనే కదా ప్రభుత్వానికి డబ్బులొస్తాయి. ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అనుమతి ఇస్తే పెట్రోలు ఎలా? డీజిల్ ఎలా? నేను రేపో మాపో పోతాను. కానీ, పిల్లల భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తున్నా అని ఆమె చెప్పారు.