Home Page SliderTelangana

అధికార మార్పిడి జరగబోతోంది ఏపీలోనూ: సీపీఐ నారాయణ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌పై ప్రజలు తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి బీజేపీ వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానానికి పోటీలో నిలబడతామని నారాయణ ప్రకటించారు.