ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ.. కొత్త వారికి పోస్టింగ్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కారు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ట్రైనీ ఐఏఎస్‌లకు సైతం పోస్టింగ్ ఇచ్చింది. సివిల్ సప్లయ్స్ డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా మల్లారపు నవీన్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విష్ణు చరణ్, మధ్యాహ్నం భోజన పథకం డైరెక్టర్‌గా నిధి మీనా, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా కట్టా సింహాచలంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లకు పలు జిల్లాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపచొడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సల్, నర్సాపురం సబ్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రవికుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూరుల్ కమీర్, అధోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అధితిసింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తిక్, గూడూరు సబ్ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్‌లను నియమించారు.