యువతకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ
భారతదేశంలో అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్ తరపు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు టెక్ దిగ్గజం ఐబీఎం , నాస్కామ్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణ ఇవ్వనుండగా, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్ ద్వారా వారి ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందిస్తారు.
ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ తదితర అంశాల్లో ఉచిత డిజిటల్ కోర్సులు, శిక్షణ, మెంటార్స్ మద్దతు అందించబడుతుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో అమలు చేయనుంది .
ప్రాజెక్ట్ ప్రభావం:అట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయి.దేశంలో డిజిటల్ సమానత్వం పెరుగుతుందిఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలకు స్కిల్‌డ్ వర్క్‌ఫోర్స్ లభిస్తుంది.ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేస్తున్న ప్రయత్నం.

