Home Page SliderNational

సీఎం మమతపై ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మండిపడ్డారు. ఎక్స్‌గ్రేషియా పేరుతో తమను కొనాలనుకుంటున్నారా? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు సరైన సమయానికి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే  ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై నెలరోజులలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ కూడా మరోపక్క ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మురం చేసింది. వైద్య కళాశాల సిబ్బందిని, విద్యార్థులను ప్రశ్నిస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా వైద్యులు, ఇతర మహిళా వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నించింది. ఈ ఘటనపై 12 గంటల ఆలస్యంగా FIR ఎందుకు నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించింది. ఆత్మహత్యగా ఎందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు? ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. వైద్యుల భద్రత కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ఘటనపై గురువారంలోగా దర్యాప్తు గురించిన వివరాలను రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. వైద్యులు సీఎం మమతను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.