Andhra PradeshHome Page SliderNewsSpiritual

తిరుపతిలో దారుణం..ఆరుగురు మృతి

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని  వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శనాలకు ఇచ్చే టోకెన్ల కోసం జనాలు పోటెత్తారు. లక్షలాది మంది జనాలు వచ్చి, టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. అక్కడి కక్కడే నలుగురు మరణించగా, మరో ఇద్దరు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 4గురు మహిళలు కావడం విషాదం. ఈ నెల 10, 11,12 తేదీలకు సంబంధించిన దర్శనాల కోసం మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన 8 కేంద్రాలలో స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ల జారీ చేస్తారు. 9 గురువారం ఉదయం 5 గంటలకు చేయవలసిన టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, బుధవారం రాత్రి 7 గంటలకే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా భక్తులు చేరుకున్నారు. ఒక్కసారిగా క్యూలైన్లలో ప్రవేశించడంతో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని స్విమ్స్, రుయా ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలిసిన తిరుపతి కలెక్టర్, టీటీడీ ఈవో, జేఈవో, ఎస్పీలు అక్కడికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.  నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వచ్చి ఈ విషయంపై సమీక్షించనున్నారు.