Home Page SliderTelangana

జార్జియాలో విషాదం.. 11 మంది భారతీయులు మృతి

జార్జియాలో తీవ్ర విషాదం జరిగింది. స్కై రిసార్ట్ గా ప్రసిద్ధి చెందిన గూడారిలోని రెస్టరెంట్ లో 12 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు ధ్రువీకరించారు. గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో వారంతా సిబ్బందిగా ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడ ఉన్న భారత ఎంబసీ అధికారులు స్పందించారు. 11 మంది భారతీయులు మృతి చెందిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. డిసెంబర్ 14న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వారిపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, శరీర భాగాలపై గాయాలేవీ లేవని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది.