Home Page SliderTelangana

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీ హై స్కూల్ లో ఖోఖో ఆడుతూ 9 క్లాస్ స్టూడెంట్ బన్నీ (14) ఒక్కసారిగా కుప్పకూలాడు. టీచర్లు, సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. జనవరి 26 కోసం స్కూల్ లో ఆటలు ఆడిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బన్నీకి గతంలో గుండె సంబంధిత చికిత్స జరిగిందని సమాచారం. ఈ ఘటనతో స్కూల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.