మాజీ గవర్నర్ ఇంట్లో విషాదం..
తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత అయిన తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళిసై తండ్రి కుమారి అనంతన్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. 2021లో తమిళిసై తల్లి మరణించగా తాజాగా తండ్రి కూడా మరణించారు. తన తండ్రి భౌతికకాయంపై ఆమె ఏడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.