ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం
హైదరాబాద్ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాగా మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన గత మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతూ కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఆరోగ్య విషమించడంతో హాస్పటల్‌లోనే తుదిశ్వాస విడిచారు. దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

