కేపీహెచ్‌బీలో విషాదం
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఒక మహిళ మృతి చెందింది. పాపం ఒక పసి బిడ్డను కాపాడబోయి తన ప్రాణాలమీదకు తెచ్చుకుంది ఆ త్యాగమూర్తి. కేపీహెచ్‌బీ లో ఒక చెట్టుపై విద్యుత్ తీగలు పడడంతో, దగ్గరలో ఆడుకుంటున్న శ్రీలక్ష్మి అనే చిన్నారి ఆచెట్టును పట్టుకుంది. ఆ పాపను కాపాడేందుకు వెళ్లిన బాపనమ్మ అనే మహిళ విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ఈ ఘటనలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చేర్చారని సమాచారం.