Home Page SliderTelangana

రోడ్డు భద్రతకు ట్రాఫిక్ వాలంటీర్లు!

టిజి: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో వారి సేవలు ఉపయోగించుకునేలా రవాణా, విద్యా, పోలీసు శాఖలు కార్యాచరణ రూపొందించాయి. విద్యార్థులను ఆగస్టు ఒకటికల్లా ఇందులో భాగస్వాములను చేయబోతున్నారు. తొలుత హైదరాబాద్‌లో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.