Home Page SliderTelangana

ప్రధాని మోడీ రాకతో నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

నారాయణగూడ: ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ఈ నెల 25, 26 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) జి.సుధీర్ బాబు తెలిపారు. 25న సాయంత్రం 5.20 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని ఇక్కడి వై.జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా రాజ్‌భవన్ చేరుకుంటారు. 26న ఉ.10.35 నుండి 11.05 మధ్య ప్రధాని రాజ్‌భవన్ నుండి ఎంఎంటీఎస్, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ వేళల్లో ట్రాఫిక్ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయి.