తిరుమలలో రద్దీ…రద్దీ
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.మొత్తం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టిటిడి ప్రకటించింది.తొక్కిసలాట అనంతరం పరిణామాలు మారతాయని అంతా భావించారు.అయితే ఏకాదశి ఉత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగగ్గలేదు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.గురువారం శ్రీవారిని 56,225 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,588 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని తెలిపారు.

