సనాతన యోధుడెక్కడ?
సనాతన ధర్మం జోలికి వస్తే ఒప్పుకోనని,తాటతీస్తానని పదే పదే చెప్పే జనసేన అధినేత ,డిసీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. తిరుమల టికెట్ల క్యూ తొక్కిసలాటలో 7గురు చనిపోయి 42 మంది గాయాలపాలైతే సనాతని ఎక్కడ నిద్రపోతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు.పవన్ నిజమైన సనాతని అయితే బాధ్యులపై కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధత వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ధ్వజమెత్తారు.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులు అనివార్యమౌతున్నాయని ఎద్దేవా చేశారు. లడ్డూలో కల్తీ జరగకపోయినా తప్పుడు ప్రచారం చేశారు.మరి ఇవాళ జరిగిన ఘటనకు మీరేం సమాధానం చెప్తారంటూ రోజా నిలదీశారు. ఒక్కో మృతినికి రూ.2 కోట్ల చొప్పున వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.