జనసేన నేత సంచలన కామెంట్స్‌పై కార్మికసంఘాలు ఫైర్
జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలపై స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలు ఫైర్ అవుతున్నారు. కార్మిక సంఘాలను కార్మిక దుకాణాలు తెరిచారని, వారిది నిజమైన పోరాటం కాదని వ్యాఖ్యానించారు సత్యనారాయణ. 2021లో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సంగతి తెలియగానే పవన్‌కళ్యాణ్ వెంటనే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసారని పేర్కొన్నారు. అప్పటికి కార్మిక సంఘాలు ఏమాత్రం క్రియాశీలకంగా లేవని పేర్కొన్నారు. కార్మికసంఘాల నేతలు అమ్ముడుపోయారని ఆయన విమర్శలు చేశారు. ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్‌కళ్యాణ్‌కు పేరు వస్తుందని ఊహించి, అప్పటికప్పుడు సంఘాల నాయకులు టెంట్‌లు వేసి, నిరసనలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కార్మికసంఘాలు ఫైర్ అవుతున్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కలిసొస్తే ఆదరిస్తామని, లేదంటే తాట తీస్తామని, అవాకులు. చెవాకులు పేలొద్దని జనసేన నేతను హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది.

