టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ మాట్లాడుతూ.. భారత్‌లో రాహుల్ జోడో యాత్ర..మామూలు పాదయాత్ర కాదన్నారు. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ప్రజల ఆత్మ గౌరవం కాపాడటానికే రాహుల్ జోడో యాత్రను ప్రారంభించారన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా తయారయ్యిందన్నారు. విపత్కర పరిస్థితులలో ప్రజలను కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ తెలంగాణాలో 15 రోజుల్లో 350కి.మీ పాదయాత్ర చేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి ప్రజలందరూ.. ఈ జోడో యాత్రను విజయవంతం చేయాలని రేవంత్ కోరారు.