Home Page SliderTelangana

మంచిర్యాలలో టఫ్ ఫైట్

మంచిర్యాల రసవత్తర పోటీకి వేదికవుతోంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన దివాకర్ రావు మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు గట్టి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో దివాకర్ రావుపై ప్రేమ్ సాగర్ రావు కేవలం 5వేల స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అందుకు పగ తీర్చుకుంటానని గెలుపు తనదేనన్న దీమాలో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. అయితే ఈసారి తన విజయానికి డోకా లేదని దివాకర్ రావు దీమాగా ఉంటే.. ఇద్దరికీ గట్టి పోటీ ఇస్తానంటున్నారు బీజేపీ అభ్యర్థి రఘునాథ్. ముగ్గురు వెలమ సామాజికవర్గం నేతలు పోటీ చేస్తున్న ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఓట్లతోపాటు ఇతర బీసీ ఓటర్లు కీలకం. ఇక్కడ్నుంచి తొలిసారి విజయం సాధించి సత్తా చాటుతానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం పోలింగ్ బూత్‌లు 287 ఉండగా పురుషులు 1,31,871, స్త్రీలు 1,32,292 ట్రాన్స్‌జెండర్లు 23 మొత్తం ఓటర్లు 2,64,186 ఉన్నారు. మంచిర్యాలలో పెరిక సామాజికవర్గం 15 శాతం, ఎస్సీలు 15 శాతం ఉండగా, మున్నూరు కాపులు సైతం ఓటర్లలో 10 శాతనికి పైగా ఉన్నారు. ఇతర బీసీలు 8 శాతం, రెడ్డి ఓట్లు 8 శాతం, మాదిగ 8 శాతం, పద్మశాలీ 7 శాతం, ఇతర ఎస్సీలు 7 శాతం, ముస్లింలు ఐదున్నర శాతం, ఉండగా వైశ్యులు 4 శాతం, ఓసీలు 4 శాతం ఉన్నారు. ఇతరులు 9-10 శాతంగా ఉన్నారు.