కొండా వ్యాఖ్యలను చూస్తూ ఊర్కోమంటున్న టాప్ స్టార్లు
నాగచైతన్య, సమంతల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయ్. సినీ ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తోంది. మంత్రి వ్యాఖ్యలను తనను ఎంతో బాధించాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి దుర్మార్గపు మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు చిరు. ప్రజాజీవితంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని జూ.ఎన్టీఆర్ అన్నారు. ఎవరి హద్దుల్లో వాళ్లుండాలని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ ఇలాంటి వ్యాఖ్యలను సహించబోదంటూ ప్రఖ్యాత నటుడు అల్లు అర్జున్ “#FilmIndustryWillNotTolerate” హ్యాష్‌ట్యాగ్‌తో తీవ్రంగా ఖండించారు.