Home Page SliderTelanganatelangana,

హైదరాబాద్‌లో వారికి రేపే చివరిరోజు..

హైదరాబాద్‌లో  213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిలో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరికి షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్‌గా ఉన్నట్టు గుర్తింపు ఉంది. దీనితో వారిని రేపటిలోగా హైదరాబాద్‌ విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. వీరు కాకుండా మిగిలిన 209 మంది పాకిస్తానీయులకు లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నట్లు గుర్తించారు.  లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవారికి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో అన్ని రాష్ట్రాలలో పాకిస్తానీయులను గుర్తిస్తున్నారు.